Sanjay Dutt: హీరోకు ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని
హీరోలకు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. ఫేవరెట్ హీరో సినిమా రిలీజవుతుందంటే చాలు రెండు, మూడు రోజుల ముందు నుంచే రిలీజ్ ఏర్పాట్లు చేస్తూ థియేటర్ల దగ్గర హడావిడి చేస్తూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్(Sanjay Dutt) కు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే ఆయనకు ఓ స్పెషల్ లేడీ ఫ్యాన్ ఉంది. నిషా పటేల్(Nisha Patel) అనే 62 ఏళ్ల ఆవిడకు సంజయ్ దత్ అంటే ఎంతో ఇష్టం. ముంబైకు చెందిన ఆమె సంజుని కలవాలని ఎన్ని సార్లు ట్రై చేసినా కుదరలేదట. సంజయ్ దత్ ను దైవంలా భావించే ఆమె కొన్నేళ్ల కిందట అనారోగ్యం పాలైంది. దీంతో తన మరణం గురించి ఆమెకు ముందే తెలిసిపోయింది.
ఈ నేపథ్యంలో నిషా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న టైమ్ లోనే తన పేరిట ఉన్న రూ.72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్ కు చెందేలా ఓ విల్లు రాయించింది.ఈ మేరకు బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడి అన్నీ ఏర్పాట్లు చేసింది నిషా. ఇటీవలే నిషా అనారోగ్యంతో మృతి చెందగా, వీలునామా ప్రకారం ఆ ఆస్తి సంజయ్ దత్ కు చేరింది. దీంతో షాకైన సంజయ్ దత్, నిషా ఎవరో తనకు తెలియదని, ఆమెను ఎప్పుడు కలుసుకున్నది కూడా లేదని, అంతటి వీరాభిమానిని కలుసుకోలేనందుకు బాధ పడుతున్నట్టు తెలుపుతూ, ఆమె ఆస్తి మాత్రం తనకు వద్దని, ఆ ఆస్తి ఆమె కుటుంబ సభ్యులకే చెందేలా నిర్ణయం తీసుకున్నాడు. సంజు భాయ్ తీసుకున్న నిర్ణయం పట్లు అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనది మంచి మనసని పొగుడుతున్నారు.













