సలార్ మొదలుపెట్టేది యానిమల్ తర్వాత
ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఎక్కడ చూసినా యానిమల్ గురించే ప్రస్తావనంతా. ఈ నేపథ్యంలో సలార్ రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ 1 సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కు హోంబలే ఫిల్మ్స్ రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మరోవైపు డంకీ ట్రైలర్ కట్ సెన్సార్ కూడా చేసుకుని రెడీగా ఉంది. 2.47 నిమిషాల డంకీ ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేయాలా అని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం యానిమల్ మానియా అన్ని చోట్లా ఉండటంతో కాస్త వెయిట్ చేసి యానిమల్ రిలీజ్ తర్వాత సలార్ ను ప్రమోట్ చేద్దామని చూస్తున్నారట మేకర్స్.
ట్రైలర్ ను యూట్యూబ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేసి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లను పలు నగరాల్లో గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ అందుబాటులోనే ఉన్నాడు కాబట్టి అది పెద్ద పనేం కాదు. కాకపోతే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ ఇప్పుడు ఊపిరి తీసుకోడానికి కూడా వీలు లేనంత బిజీగా ఉన్నారు. వీరిద్దరూ రీరికార్డింగ్ అయ్యే వరకు రిలాక్స్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరి సలార్ ప్రమోషన్స్ ను ప్రభాస్ ఒక్కడే చేయనున్నాడా లేక ఇంకేమైనా స్పెషల్ గా ప్లాన్ చేశారా అన్నది చూడాలి. డిసెంబర్ 22న సలార్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













