రణస్థలం ఫస్ట్ లుక్ విడుదల
రాజ్, షా జంటగా నటిస్తున్న చిత్రం రణస్థలం. ఆది అరవల దర్శకుడు. కావాలి రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సాధారణ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగాడు రాజు. అతడు నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కథే ఈ సినిమాకు హీరో. ప్రేమ యుద్ధంలో ఓ యువకుడు ఎలా విజయతీరాలకు చేరాడన్నది ఆసక్తిని పంచుతుంది అని తెలిపారు. ప్రస్తుతం సెన్సార్ జరుగుతున్నదని, నవంబర్ మొదటి వారంలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. సత్యంరాజేష్, ఛత్రపతి శేఖర్, రాగిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రాజకిరణ్, కెమెరా: ప్రభాకర్.













