కల నెరవేర్చుకోబోతున్న చరణ్
ఆర్ఆర్ఆర్ తర్వాత వరుసగా సినిమాలు చేసి తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు నిరాశే ఎదురవుతోంది. అనుకోకుండా చేసిన ఆచార్య సినిమా దారుణమైన డిజాస్టర్ కాగా, శంకర్ తో దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.
ఇండియన్2 ప్రాజెక్ట్ తో శంకర్ బిజీగా ఉండటం వల్ల గేమ్ ఛేంజర్ మూవీ రోజురోజుకీ లేటవుతుంది. రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లారు కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి చాలానేటైమ్ పట్టేట్లుంది. ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్ ఎండింగ్ కు చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో కూడా ఓ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని చూస్తున్నాడట బుచ్చిబాబు. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాతో చరణ్ తన కలను నెరవేర్చుకోబోతున్నాడు. వ్యక్తిగతంగా స్పోర్ట్ డ్రామాలను ఇష్టపడే చరణ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఈ జానర్ లో చేసింది లేదు.
గతంలో రెండు సార్లు ఆ జానర్లో సినిమాలు చేయాలని చరణ్ అనుకున్నప్పటికీ అవి అనుకోకుండా క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడు బుచ్చిబాబు అదే జానర్ లో కథ తీసుకునిరావడం, ఆ కథకు చరణ్ ఓకే చెప్పడం, దానికి తోడు ఇప్పటికే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవడంతో చరణ్ ఈ సినిమాతో తన కలను నెరవేర్చుకోబోతున్నాడని ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు.













