ప్రభాస్ వచ్చేలా లేడే!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సలార్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాయిదాల మీద వాయిదాల తర్వాత మొత్తానికి ఈ నెల 22న సలార్ థియేటర్లలోకి రానుంది.
రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు మిక్డ్స్ రెస్పాన్స్ రావడంతో మరో ట్రైలర్ ను కట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ సలార్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయకపోవడం ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్రమోషన్స్ చేయకుండా ఉంటే ఆడియన్స్ కు సరిగా రీచ్ అవదు.
కానీ ప్రభాస్ మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, రీసెంట్ గా సర్జరీ చేయించుకున్న ప్రభాస్ హెల్త్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదట. ఇంకా రెస్ట్ తీసుకోవాల్సి ఉందని డాక్టర్లు సూచించారని, అందుకే ప్రభాస్ మొన్న ఓటేయడానికి కూడా రాలేదని తెలుస్తోంది. కానీ సలార్ కు బజ్ పెరగాలంటే మాత్రం ప్రమోషన్స్ ను వెంటనే స్టార్ట్ చేయాలి. అన్ని మెయిన్ సిటీల్లో ప్రెస్ మీట్స్, మీడియాకు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నీ చేయాల్సి ఉంది. కేవలం ప్రీ రిలీజ్ కైనా వచ్చి ప్రభాస్ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడితే ఫ్యాన్స్ కు కూడా సలార్ పై ఆశలు కలుగుతాయి. కానీ ప్రభాస్ పరిస్థితి చూస్తుంటే మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనేలా కనిపించడం లేదు.













