త్రివిక్రమ్ డెసిషన్‌ను సూపర్ అనేసిన పవన్
ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తూనే, మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న వినోదాయ సీతం రీమేక్ కు అన్నీ తానై నడిపిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవన్ ఏ సినిమా చేసినా అందులో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కచ్చితంగా ఉండాల్సిందే. అందులోనూ పవన్ చేస్తుంది రీమేక్ కాబట్టి, ఇక ఆ సినిమా మొత్తం బాధ్యత దాదాపు త్రివిక్రమ్ దే ఉంటుంది.
ప్రస్తుతం సముద్రకని దర్శకత్వంలో పవన్ వినోదాయ సీతం రీమేక్ చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన టాకీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఓ మంచి టైటిల్‌ను త్రివిక్రమ్ పవన్‌కు సజెస్ట్ చేశారట. పవన్ కూడా ఆ టైటిల్‌కు సూపర్ ప్రొసీడ్ అని రెస్పాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ ఏం చేసినా బాగుంటుందనే నమ్మకం పవన్‌కళ్యాణ్ కు ఉంది. దానికి తోడు పవన్ కు ఇప్పుడు తనకున్న షెడ్యూల్ ప్రకారం టైటిల్స్ గురించి కూడా ఆలోచించేంత తీరిక లేదు. అందుకే త్రివిక్రమ్ చెప్పిన టైటిల్‌ను ఓకే అనేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ తో పాటూ, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే పవన్ ఈ సినిమాతో పాటుగా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేస్తున్నాడు. మే నెల మొత్తం సుజిత్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం పవన్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పవన్ తను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.













