సుశీలకు కొప్పరపు జాతీయ పురస్కారం
గానకోకిల పి.సుశీలకు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందజేసి ఆమెను ఘనంగా సత్కరించారు. అలాగే అవధానాచర్య డాక్టర్ ఆశావాది ప్రకాశరావుకు కొప్పరపు కవుల స్మారక అవధాన పురస్కారాన్ని అందజేశారు. కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, గేయరచయిత జొన్నవిత్తుల తదితరులు అందించారు.













