Jana Nayakudu: ‘జన నాయకుడు’ నుంచి ‘ఒక పేరే అలరారు..’ సాంగ్ రిలీజ్..
దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జన నాయకుడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెచ్.వినోద్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. మూవీపై భారీ అంచనాలున్నాయి. తాజాగా మేకకర్స్ ఈ సినిమా నుంచి ‘ఒక పేరే అలరారు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాటకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తోన్నజన నాయకుడు సినిమాలోని ఈ పాటను తెలుగులో శ్రీనివాస మౌళి రాయగా, శ్రీకృష్ణ, విశాల్ మిశ్రా ఆలపించారు. పాటలోని బలమైన సాహిత్యం దానికి తగ్గ బీట్ అందరినీ మెప్పిస్తోంది. తన అభిమానులతో దళపతి విజయ్‌కున్న గాఢమైన అనుబంధాన్ని ఈ పాట ద్వారా వ్యక్తం చేశారు. అన్నీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో పాట దూసుకెళ్తోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ‘జన నాయకుడు’ కావటం ఓ ప్రత్యేకత. అలాగే విజయ్ కెరీర్లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇంతకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే.. అందులో ఆయన తన అభిమానులతో కలిసి ఓ సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. దీనికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులతో ఆయనుకున్న బలమైన, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
విజయ్‌కి ఉన్న తిరుగులని అభిమాన గణం. ఐదు రోజలు పండుగ వీకెండ్ కలిసి రావటం, ప్రపంచ వ్యాప్తంగా జన నాయకుడు సినిమాపై ఉన్న ఆసక్తితో సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను భావోద్వేగంగా తాకే, చిరకాలం గుర్తుండిపోయే సినీ అనుభూతిని అందించనుంది.






