ఈ వారం సినిమాలకు ప్రకృతి, ఎన్నికల సవాళ్లు!
టాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విక్టరీ వెంకటేష్(venkatesh) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) ఒకవైపు, విశ్వక్ సేన్(Viswaksen) స్వీయ దర్శకత్వంలో నటించిన కల్ట్(Cult) మరోవైపు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. విభిన్న జానర్లలో రూపొందిన ఈ సినిమాలపై ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ గా చేసుకోగా, విశ్వక్ సేన్ తన సినిమాతో కొత్త తరహా థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించాలని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ సినిమాల రిలీజ్ కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు చిత్ర బృందాలకు సవాలుగా మారనున్నాయి. ఆర్నబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నష్టం వాటిల్లగా, మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆడియన్స్ థియేటర్లకు వచ్చేందుకు వెనుకాడితే, డే1 కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందా అన్నది చూడాలి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా మొదలైంది. ఎన్నికల కార్యక్రమాలు, ప్రచార హడావుడి కారణంగా ప్రేక్షకుల దృష్టి సినిమాల నుంచి మళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ, ఆదర్శ కుటుంబం, కల్ట్ సినిమాల నిర్మాతలు ముందుగా డిసైడ్ చేసిన ప్రకారమే రిలీజ్‌కు రెడీ అయ్యారు. తెలుగు తెరపై స్లాషర్ జానర్‌కు కొత్త గుర్తింపు తీసుకురావాలని కల్ట్ తో విశ్వక్ సేన్ ప్రయత్నిస్తుండగా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే ఆదర్శ కుటుంబం లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రకృతి ప్రతికూలతలు, ఎన్నికల హడావుడి మధ్య ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.








