లెనిన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
టాలీవుడ్లో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని(akhil akkineni) నటిస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ లెనిన్పై మళ్లీ చర్చ మొదలైంది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు(Murali kishore Abburu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ(Bhagyasri) హీరోయిన్గా నటిస్తుండగా, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్‌పై ఇటీవల అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానుల్లో కొంత అనిశ్చితి నెలకొంది. అయితే, ఈ ఊహాగానాలన్నిటికీ తాజాగా స్పష్టత వచ్చినట్టైంది.
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) స్వయంగా లెనిన్ ఫస్ట్ కట్‌ను వీక్షించి సినిమాపై తన రివ్యూని షేర్ చేసుకోవడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. అఖిల్ కెరీర్లో ఇది పూర్తిగా కొత్త అవతారం అని, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ఎనర్జీ, ప్రెజెన్స్ ఈ సినిమాలో కనిపిస్తాయని నాగార్జున నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన రెస్పాన్స్‌తో సినిమా కంటెంట్‌పై నమ్మకం పెరిగినట్టే కాకుండా, ఫ్యాన్స్‌లో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది.
అంతే కాకుండా లెనిన్ రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చిన నాగార్జున, ఈ సినిమాను జూన్ 26న గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతో వాయిదా వార్తలకు చెక్ పడినట్టే అయింది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగార్జునతో పాటూ సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavamsi) నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న లెనిన్ అఖిల్‌కు బాక్సాఫీస్ వద్ద ఎంతటి మైలేజ్ ఇస్తుందో చూడాలి.








