లెనిన్ వచ్చేదెప్పుడు?
యంగ్ హీరో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తన కొత్త సినిమా లెనిన్(Lenin) తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ప్రేమ, యాక్షన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ డ్రామా మొదటగా జూన్ 25న విడుదల చేయాలని ప్రకటించారు. అయితే అదే తేదీకి మరో సినిమా పెద్ది(Peddi) పోస్ట్‌పోన్ కావడంతో, విడుదల పోటీ పెరిగింది. దీంతో లెనిన్ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌పై ఆలోచనలు ప్రారంభించారు. ప్రస్తుతానికి జూలై చివరి వారాన్ని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇండిపెండెన్స్ డే వీకెండ్లో పెద్ద సినిమాలు లేకపోతే ఆ హాలిడే సీజన్‌ను క్యాష్ చేసుకునే అవకాశాన్ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారు. లేదంటే జూలై చివరి వారంలోనే సినిమా విడుదలకు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉండగా, డిజిటల్ డీల్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. మే నెలలో ఈ ఒప్పందం క్లోజ్ అయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) మరియు సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) నటిస్తుండగా, సంగీతాన్ని తమన్ (S. Thaman) అందిస్తున్నారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత అఖిల్ నుండి వస్తున్న ఈ సినిమా అతని కెరీర్‌కు కీలకంగా మారనుంది. అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.








