నా పేరు రాజా టీజర్ విడుదల
రాజ్ సూరియన్ హీరోగా, ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం నా పేరు రాజా. అశ్విన్కృష్ణ దర్శకత్వంలో రాజ్ సూరియన్, ప్రభాకర రెడ్డి, కిరణ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత రాజ్ సూరియన్ మాట్లాడుతూ నాకు ఇది మూడో చిత్రం. రొమాంటిక్, యాక్షన్, లవ్ అంశాలతో సినిమా ఉంటుంది. ఈ నెల 20న ట్రైలర్ విడుదల చేస్తాం. ఈ నెల 31న సినిమాను విడుదల చేయాలని మా ప్లాన్ అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్, మనాలి, కేరళలో షూటింగ్ చేశాం. కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్ అనీ, హీరో కేరెక్టర్లో మూడు విభిన్న కోణాలు ఉంటాయనీ దర్శకుడు చెప్పారు.













