అనిరుధ్ విశ్వరూపం చూడబోతున్నారు
పదిహేడేళ్ల వయసులోనే త్రీ సినిమాలోని కొలవరి పాటతో సంచలనం క్రియేట్ చేశాడు అనిరుధ్ రవిచందర్. ఆ టైమ్ లో ఏదో ఒక పాట కుదిరిందిలే అనుకున్నా, ఆ తర్వాత ఆ సినిమాను మించిన ఆల్బమ్స్‌తో తన మ్యూజిక్ పవర్ ఏంటో చూపించాడు అనిరుధ్. అనిరుధ్ సౌత్‌లోనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు.
అనిరుధ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు, ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తుంటే తన స్థాయి ఏంటో తెలుస్తోంది. అటు తమిళంలో, ఇటు తెలుగులో క్రేజీ సినిమాలతో తన రేంజ్ ఏంటో చూపిస్తున్న అనిరుధ్, త్వరలో తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు తను చేస్తున్న సినిమాలు చూస్తుంటేనే తెలుస్తోంది.
తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్-2కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటూ రజినీకాంత్ జైలర్ సినిమాకు అనిరుధే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. ఇది కాకుండా విజయ్ లియో కు, అజిత్ హీరోగా రానున్న విడా ముయర్చికి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. రజినీకాంత్ కొత్త సినిమాకు కూడా అతనే మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్30 సినిమాకు కూడా ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరే స్వరాలు సమకూరుస్తున్నాడు. విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాకు అనిరుధ్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు హిందీలో షారుఖ్ జవాన్ సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమాకు 5-6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిరుధ్ లైనప్ చూస్తుంటే త్వరలోనే అనిరుధ్ మ్యానియా చూడబోతున్నట్లు అర్థమవుతోంది.













