సలార్‌ను ఫాలో అవనున్న గుంటూరు కారం
టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు మేకర్స్ ప్రమోషన్స్ చేయకుండా ఉన్న బజ్ సరిపోతుందని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. నాని లాంటి టైర్2 హీరోలు మాత్రం రెండు నెలల ముందు నుంచే దేశమంతా తిరిగి ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మాత్రం సలార్ కు ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు.
సలార్ రూట్లోనే ఇప్పుడు గుంటూరు కారం యూనిట్ కూడా వెళ్లనుందని తెలుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఒకే ఒక్క ఈవెంట్ లో మాత్రమే మహేష్ బాబు కనిపించనున్నాడట. జనవరి 6న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ తో పాటూ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ప్లాన్ చేశారట మేకర్స్.
ఇది కాకుండా సుమతో ఓ రికార్డెడ్ ఇంటర్వ్యూ చేయడానికి కూడా మహేష్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇవి తప్ప మిగిలిన ప్రమోషన్స్ లో మహేష్ కనిపించడని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ కాగా ఆ రెండు పాటలకూ మిశ్రమ స్పందన లభించింది. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై ఉన్న హైప్ ను పెంచాలని చూస్తున్నారు మేకర్స్. మరి సలార్ ను ఫాలో అవుతున్న గుంటూరు కారం కు క్రేజ్ ఏ మాత్రం వస్తుందో చూడాలి.













