ఆయన రాజకీయాల్లోకి రానందుకు బాధపడ్డా
రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంపై ఆయన సతీమణి లత కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోవడం తనను బాధించిందన్నారు. ఆయనలో నిజమైన నాయకుడిని చూశా. బలమైన కారణంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయనే కనుక రాజకీయాల్లో ఉండే ఉంటే సూపర్ పవర్గాఎదిగేవారు అని అన్నారు. సమాజంలో పేరు పొందిన వ్యక్తిని అవమానించేందుకు పెట్టిన కేసు ఇది. సెలబ్రిటీలుగా ఉన్నందుకు మేమముం మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ కేసు పెద్దది కాకపోవచ్చు కానీ దీని గురించి భారీగానే ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే ఇందులో ఎలాంటి మోసం జరగలేదు. పలు కథనాల్లో ప్రచురితమైనట్లు ఆ డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా మీడియా వన్. సంబంధిత వ్యక్తులకు మధ్య జరిగిన వ్యవహారం. ఇప్పటికే వాళ్లు ఈ సమస్యను సెటిల్ చేసుకున్నారు. ఈ విషయంలో నేను కేవలం హామీదారుగా మాత్రమే ఉన్నా అని తెలిపారు.













