‘ఖేల్’ ఫస్ట్‌లుక్ విడుదల
రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్‌కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ఖేల్. లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్ కుమార్.ఆర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకంపై గొట్టిముక్కల పాండు రంగారావు, పులి అమృత్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హైదరాబాద్ సినిమా హబ్‌గా మారనుంది. షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఖేల్ సినిమా విజయవంతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అద్యక్షుడు యు.సత్యనారాయణ, కూకట్పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ సాధనాల, సంగీతం: ఆనంద్ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్‌గౌడ్.













