కరొనా తో నటి మాలాశ్రీ భర్త, కన్నడ సినీ నిర్మాత రాము మృతి
కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రాము సోమవారం సాయంత్రం 6.10 గంటలకు బెంగళూరు రామయ్య హాస్పటల్ లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. 90వ దశకం లో టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా ‘ప్రేమ ఖైదీ’ ‘బావ బావమరిది’ చిత్రాలలో పేరు తెచ్చుకుని నటి మాలాశ్రీ భర్త రాము. 1993లో ‘గోలిబార్ ‘ కన్నడ చిత్రం తో రాము ఎంటర్ప్రెస్సెస్ బ్యానర్ స్థాపించిన రాము, షుమారు 40 చిత్రాల వరకు నిర్మించారు. అతని నిర్మించిన ఏ కె 47, లాక్ అప్ డెత్, కాల సిపాళ్య, గంగ బ్లాక్ బస్టర్ చిత్రాలు గా నిలిచాయి. రాము నిర్మించిన ఆఖరి చిత్రం ’99’ 2019లో విడుదల అయ్యింది. తన భార్యాను హీరోయిన్ గా పెట్టి ఫీమేల్ ఓరియెంటెడ్ గా తీసిన మూవీస్ మాస్ కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్మాతగానే కాకుండా 50 చిత్రాల వరకు పంపిణీదారుడిగా వ్యవహరించారు.













