5జీ కి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి … హైకోర్టులో

దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచాల్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని వల్ల మనుషులు, వృక్ష జంతుజాలంపై ప్రస్తుతమున్న దానికంటే 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా రేడియేషన్ ప్రభావం పడుతుందని పిటిషన్‍లో పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీ సురక్షితమేనని అధికారులు ధ్రువీకరించాలని, ఈ మేరకు వారికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై జూన్ 2న విచారణ జరగనుంది.