రామ్ చరణ్ కొత్త లుక్‌పై భారీ అంచనాలు.. సుకుమార్ ప్లాన్ ఏంటి?
రామ్ చరణ్(ram charan), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న RC17 సినిమాపై టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది. రంగస్థలం(rangasthalam) వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో రామ్ చరణ్ కనిపించబోయే తీరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని సమాచారం. ఆయన క్యారెక్టర్ల కు తగ్గట్టుగా మేకోవర్ చేసేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం ఆయన కొత్త లుక్కు సంబంధించిన ఫొటోషూట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రామ్ చరణ్ పొడవాటి జుట్టుతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారట. ఇప్పటివరకు ఆయన పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టరైజేషన్ ఉండేలా సుకుమార్ ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కనిపించిన భారీ శరీరాకృతికి భిన్నంగా బరువు తగ్గి కొత్త రూపంలోకి మారనున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఛేంజెస్ నిజమైతే స్క్రీన్ పై రామ్ చరణ్‌ను కొత్తగా చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, RC17 సినిమాను నవంబర్ 1న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. హీరోయిన్గా సారా అర్జున్(Sara arjun), అనీత్ పద్దా(aneeth padda) పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) మ్యూజిక్ అందించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చిత్ర ప్రారంభోత్సవం నేపథ్యంలో నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలతో పాటు రామ్ చరణ్ కొత్త లుక్‌పై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.








