గాడ్ ఆఫ్ వార్ పై బిగ్ అప్డేట్
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన భారీ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ మరోసారి వార్తల్లో నిలిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram Srinivas) తెరకెక్కించనున్న ఈ మైథలాజికల్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభంలో ఈ సినిమాను అల్లు అర్జున్(Allu arjun) తో అనౌన్స్ చేయగా, పుష్ప2(Pushpa2) తర్వాత ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా భవిష్యత్తుపై అనేక సందేహాలు తలెత్తాయి. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టుల లైనప్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో, గాడ్ ఆఫ్ వార్ పై అనిశ్చితి మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్(NTR) చేతిలోకి వెళ్లిందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే భారీ కథలకు ప్రాధాన్యం ఇస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించిన ఎన్టీఆర్‌కు ఈ ప్రాజెక్ట్ సరైన ఎంపికగా భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కాంబినేషన్ దాదాపు ఫైనల్ దశలో ఉందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. ఈ వార్తలతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇదే సమయంలో మే 20 కీలక తేదీగా మారింది. అదే రోజున ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో, ఆ సందర్భంగా గ్రాండ్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ వీడియో కోసం అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఒకవేళ ఈ అనౌన్స్మెంట్ నిజమైతే, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ అధికారికంగా ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్లో ఈ సినిమా కొత్త ప్రమాణాలను సెట్ చేసే ప్రాజెక్ట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.








