AK47: ఆదర్శకుటుంబంలో మరో హీరోయిన్?
టాలీవుడ్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam) సినిమా ప్రారంభం నుంచే మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెంకటేష్‌కు సరిపోయే ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్ మరియు ఎమోషనల్ స్క్రీన్‌ప్లే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతున్నాయి. శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) హీరోయిన్గా నటిస్తుండగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్లాన్ ప్రకారం కొనసాగుతోంది. అయితే షూటింగ్ స్లోగా జరుగుతుండటం వల్ల సమ్మర్ రిలీజ్ రేస్ నుంచి ఈ సినిమా తప్పుకున్నట్టు తెలుస్తున్నా, మేకర్స్ మాత్రం క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పూజిత పొన్నాడ(Poojitha Ponnada) కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు(Hari Hara veera mallu)లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈ సినిమాలో నారా రోహిత్(Nara Rohit)కు జంటగా కనిపించనుందని చెబుతున్నారు. ఈ జోడీ కథలో ఒక ప్రత్యేక ట్రాక్‌ను తీసుకువస్తుందని, ప్రధాన కథనానికి అనుసంధానమయ్యేలా వారి పాత్రలు ఉండనున్నాయని సమాచారం. దీంతో ఈ సినిమాలో మల్టిపుల్ ట్రాక్స్ ద్వారా కథను విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది.
మ్యూజిక్ విషయంలో కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైన తమన్(Thaman) ప్లేస్ లో హర్ష వర్ధన్ రామేశ్వర్(Harashavardhan Rameswar)ను తీసుకురావడం విశేషం. ఈ మార్పుతో సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతంపై కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్(Harika haassinee Creations) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా, త్రివిక్రమ్-వెంకటేష్ కాంబోలో మరో గుర్తుండిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.








