అమరావతిలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో రాజధాని చలనచిత్ర, టీవీ శిక్షణ సంస్థను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి కేంద్రంగా ఉండే ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన తరగతులను తాత్కాలికంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఏయే కోర్సులు నిర్వహించాలి? ఏ విధంగా సంస్థను తీర్చిదిద్దాలనే అంశాలపై ప్రభుత్వ అధికారులు, సినీ ప్రముఖలతో కమిటీని నియమించారు. ఈ మేరకు సమాచార శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నేతృత్వం వహిస్తారు. అమరావతిలో ఏర్పాటు చేసే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరహాలోనే ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ సంయుక్తంగా నిర్వహించే అవకాశాలున్నాయి.













