కోలీవుడ్ లో ఈషా బిజీ అవుతుందా?
కోలీవుడ్లో జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటోంది ఈషా రెబ్బా. ఆమెతో పాటు ఈ సినిమాలో నిఖిషా పటేల్ మరో హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి ఈషా కోలీవుడ్లో బిజీ అవుతుందా, లేదా అనేది చూడాలి. ఈ సినిమాతో పాటు తెలుగులో ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈషా రెబ్బా.













