ఇషా ప్రాబ్లమేంటి అసలు?
మన తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా ఒక వైపు సోలో గా హీరోయిన్ గా నటిస్తూనే.. అగ్ర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న ఇషా క్యారెక్టర్ రేంజ్ పెద్దదేనట. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పిట్ట కథలులో ఒక కథలో ఇషా నటించింది. కానీ అది అనుకున్నంతగా విజయం దక్కించుకోలేదు. ఇటు కెరీర్ పరంగా కూడా ఇషా కు పెద్దగా స్పీడ్ ఏమీ లేదు. ఇలాంటి క్రమంలో ఇషా కు ఒక బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
గుణశేఖర్ తెరకెక్కిస్తున్నశాకుంతలం లో ఒక క్యారెక్టర్ కోసం ఇషా ను అడిగారట. అయితే ఈ ఆఫర్ ని ఇషా తిరస్కరించినట్లు టాక్. అది ఎందుకు అని అంటుంటే కొంతమంది రెమ్యూనరేషన్ వల్ల అంటే, మరికొందరు పాత్ర క్యారెక్టర్ పరిధి తక్కువ ఉండటం వల్ల అంటున్నారు. అసలు కారణమేంటనేది ఇషా నే నోరు విప్పాల్సి ఉంది. శాకుంతలం లో శకుంతల పాత్రలో సమంత నటిస్తుంది. ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.













