తనపై వస్తున్న పుకార్లపై… లేడీ సూపర్ స్టార్ క్లారిటీ
తనపై వస్తున్న పుకార్లకు లేడీ సూపర్‌స్టార్ నయనతార చెక్ చెప్పింది. మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. విఘ్నేష్ శివన్‌తో ప్రేమ, పెళ్లి విషయమై కొన్నాళ్లుగా కొనసాగుతున్న చర్చపై ఆమె తాజాగా స్పందించింది. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం విఘ్నేష్ శివన్ ఒక ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోకు జీవితం కోసం చేతివేళ్లు కలిశాయి.. అంటూ కామెంట్ పెట్టారు. ఆ ఫొటోలో నయనతార, విఘ్నేష్‌లు చాలా అన్యోన్యగా అప్వాయంగా ప్రేమగా ఉన్నారు. కాగా ఎట్టకేలకు తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని, ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ తన చేతి వేలికి ఉన్న రింగ్‌ను చూపించింది.
నయనతార నటించిన చిత్రం నేత్రికన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. ఇందులో ఆమె అంధురాలిగా నటించింది. ఈ సినిమాను తనే స్వయంగా నిర్మించటంతో ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరైంది. తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చింది. విఘ్నేష్ శివన్‌తో పెళ్లి విషయంపై ఇంటర్వ్యూలో పేర్కొంది. ఎంగేజ్మెంట్ పూర్తయిందని, ఆమె తన వేలికి ఉన్న రింగ్‌ను చూపించటం జరిగింది.













