జూహీ చావ్లాకు షాక్… 5జీ పిటిషన్ ను

బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. 5జీ వైర్‍లెస్ నెట్‍వర్క్ కు సంబంధించి ఇండియాలో ట్రయల్స్ ను వ్యతిరేకిస్తూ ఆమె వేసిన పిటిషన్‍ను కొట్టేసింది. అంతేకాదు ఆమెకు రూ.20 లక్షల జరిమానా కూడా విధించింది. ఆమె న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని కోర్టు తీర్పు సృష్టం చేసింది. ఈ దావా కేవలం పబ్లిసిటీ కోసం వేసినట్లుగా ఉన్నదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. కోర్టు విచారణ లింక్‍ను జూహీ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా అన్పిస్తోందని తెలిపింది. న్యాయపక్రియను హేళన చేసినందుకుగాను పిటిషనర్లకు రూ.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అంతేగాక, విచారణ సమయంలో ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.