ప్రమోషన్లతో భయపెట్టనున్న మహేష్
మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతున్న టైమ్ లో వేరే సినిమాలు రిలీజ్ అవాలంటే అందరూ ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్లైతే తప్పించి మహేష్ లాంటి స్టార్ హీరోకు పోటీగా ఎవరూ వెళ్లరు. అది కూడా పెద్ద స్టార్ల సినిమాలు అయితేనే మహేష్ తో పోటీకి రెడీ అవుతాయి. కానీ ఈసారి మహేష్ కు పోటీగా సంక్రాంతికి నాలుగైదు మీడియం రేంజ్ సినిమాలు కూడా రానున్నాయి.
త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో మహేష్ చేస్తున్న గుంటూరు కారం సినిమాకు ఎవరూ భయపడటం లేదనేది వాస్తవం. ఈగల్, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్ లాంటి సినిమాలు గుంటూరు కారంకు పోటీగా సంక్రాంతి బరిలో ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల గుంటూరు కారం సినిమాకు నెగిటివ్ బజ్ వచ్చిన మాటైతే వాస్తవం.
దానికి తోడు ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని చాలా మందికి డౌటుంది. అందుకే తమ సినిమాలను ధైర్యంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. కానీ గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్లలో దింపుతాం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అంతేకాదు దసరాకు ఫస్ట్ సాంగ్ ను లాంచ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారట గుంటూరుకారం మేకర్స్.
ఆ తర్వాత ఓ నెల గ్యాప్ ఇచ్చి రిలీజ్ కు రెండు నెలల ముందు నుంచే ప్లానింగ్ ప్రకారం సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అంటూ ఫ్యాన్స్ కు ఊపిరాడనీయకుండా ట్రీట్ ఇవ్వనున్నారట. వీటన్నింటినీ చూసి కనీసం రెండు సినిమాలైనా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం ఖాయమని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు మహేష్, అటు త్రివిక్రమ్ కూడా సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.













