బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడినందుకు…
సినిమాల్లోగానీ, టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లోగానీ ఒక వర్గాన్ని అవమానించినా, అవహేళన చేసినా ఒకప్పుడు పట్టించుకునేవారు కాదు. కానీ, మాధ్యమాలు బాగా పెరిగిన తర్వాత ఇలాంటి విషయాల్లో కాస్త సీరియస్‌గానే వ్యవహరిస్తున్నారు జనం. బుల్లితెరపై యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది.
ఈమధ్యకాలంలో బుల్లితెరకే పరిమితమైపోయిన శ్రీముఖి పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ అందర్నీ ఉత్సాహపరిచే శ్రీముఖిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. జెమినీ టీవీలో శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఓ కార్యక్రమంలో బ్రాహ్మణుల్ని కించ పరుస్తూ మాట్లాడిందట. దీనిపై హైదరాబాద్‌లోని న్యూ విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఎం.వెంకటరామశర్మ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు శ్రీముఖిపై, జెమిని టీవీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.













