Blood Roses: మహా శివరాత్రి సందర్భంగా ‘బ్లడ్ రోజస్’ ఫస్ట్ లుక్ విడుదల !!!
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో నాగన్న మరియు లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
రంజిత్ రామ్,(Ranjith Ram) అప్సర రాణి(Apsra Rani) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, క్రాంతి కిల్లి, ప్రగ్యా, నవిత, వైష్ణవి, ఆనంద్, లౌక్య, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, రాధిక, మమత రెడ్డి తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.
బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామెన్ బోగిరెడ్డి శివకుమార్ సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.













