12న భీష్మ టీజర్ విడుదల
నితిన్ కథానాయకుడుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం భీష్మ, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకి సంబంధించిన టీజర్‌ను 12న విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం ప్రకటిచింది. నితిన్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడని, చిత్రానికి సింగిల్ పరెవర్ ఉప శీర్షికను కూడా నిర్ణయించామని యూనిట్ తెలియజేసింది. అయితే ఈ చిత్రంలో ఓ కీ రోల్లో హెబ్బా పటేల్ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఆమె నెగిటివ్ షేడ్స్‌తో ఉన్న పాత్రలో కనిపించనున్నదట. నితిన్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ రూపొందిస్తున్న చిత్రంలో రష్మిక మండన హీరోయిన్.













