చీరకట్టులో మతిపోగొడుతున్న 18 పేజెస్ బ్యూటీ…!
చూడగానే తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించే హీరోయిన్లలో ముందుంటుంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియాని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు లో అఆ సినిమా తో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసుని దోచుకున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేమమ్ లో కూడా నటించి మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో అడుగు పెట్టిన మొదటి ఏడాదిలోనే రెండు సినిమాలు చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంది.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమ, ఇష్టం వచ్చినట్టు సినిమాలకి సైన్ చేయకుండా, మొదటి నుండి ఆచి తూచి అడుగులు వేస్తుంది. మంచి పాత్ర మంచి కథ ఉంటేనే సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు నిఖిల్ తో కలిసి నటించిన 18 పేజెస్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉందన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ చీరకట్టు లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అనుపమ అందమైన చీరకట్టు, అందులోని అందాలు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలైతే హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే ఎక్కువ మందిని ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ అనుపమ మాత్రం అందాల ప్రదర్శన చేయకున్నా కూడా ఈమె ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా చీర కట్టులో పద్దతైన అమ్మాయి పాత్రలో కనిపించినా కూడా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా భలే ఉందే అంటూ అనుపమ అందం గురించి కామెంట్స్ చేస్తున్నారు. తన అందం, నటనతో క్రిటిక్స్ ని సైతం మెప్పించింది ఈ ముద్దు గుమ్మ. ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తూనే ఉంది అనుపమ. తన కెరీర్ ఇలానే ముందుకి సాగాలని కోరుకుందాం.













