‘ఆదిత్య’కు భారత వరల్డ్ రికార్డు
బాలల చిత్రం ఆదిత్య కు భారత వరల్డ్ రికార్డు అవార్డు దక్కింది. ఈ అవార్డును రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు భారత వరల్డ్ రికార్డ్ ప్రతినిధి నరేందర్ చిత్ర దర్శకుడు భీమగాని సుధాకర్గౌడ్కు అందజేశారు. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, సంతోష్ ఫిల్మ్స్ పతాకాలపై నిర్మించిన ఆదిత్య చిత్రం ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వినోదపు పన్నురాయితీ పొంది అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో అవార్డును కైవసం చేసుకుంది. భారత్తో పాటు పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అనేక పురస్కారాలను పొందింది. ఈ చిత్రం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డును అందజేశారు.













