‘గల్లీ రౌడీ’ని లాంచ్ చేసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ
సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో నేహా శర్మ హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా టీజర్‌ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సందీప్ ‘గల్లీ రౌడీ’ అనే సినిమాతో ప్రేక్షకులను త్వరలో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం లాంచ్ చేశాడు. కుటంబం బలవంతం వల్ల రౌడీగా మారిన వ్యక్తిగా సందీప్ ఇందులో కనిపిస్తున్నాడు. ‘బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అంటూ పోసాని కృష్ణ మురళీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో కలిసి హీరో ఓ వ్యక్తిని చేసే కిడ్నాప్ నేపథ్యంలో కథ సాగుతుంది.
అయితే వాళ్లు ఎవరిని కిడ్నాప్ చేస్తారా.. అనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. చివరిగా ‘ఎవరైనా మనవడిని డాక్టర్ చేస్తాడు.. లేదా ఇంజనీర్ చేస్తాడు.. మరీ డబ్బుంటే ఎంఎల్ఏని చేస్తాడు.. ఈ రౌడీని చేయడం ఏంటీ రా’ అని హీరోని ప్రశ్నిస్తే… ‘నెపోటిజం రా’ అంటూ అతను సమాధానం చెప్పడంతో టీజర్ ముగుస్తుంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.













