28 డిగ్రీ సెల్సియస్ ఫస్ట్ లుక్ విడుదల
కథానాయకుడిగానే కాదు, ఇటీవల పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 28 డిగ్రీ సెల్సియస్. షాలిని కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నవీన్ చంద్ర దీర్ఘంగా ఆలోచిస్తుండగా, ఆయన తలలో నుంచి ప్రశ్నల రూపంలో కాగితాలు పైకి ఎగురుతూ కనిపించాయి. నవీన్‌చంద్ర వెనుక హీరోయిన్ షాలిని కోపంగా చూస్తూ కనిపించింది. ఒక విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్ పతాకంపై సాయి అభిషేక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వాణ్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు.













