బ్యాంకు లోన్ రావడం లేదా? మీ సిబిల్ స్కోరును పెంచే సూపర్ ఫార్ములాలు ఇవే!
Credit Score: మీరు అత్యవసరంగా పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందనే కారణంతో అప్లికేషన్ తిరస్కరణకు గురైతే అది పెద్ద సమస్యగా మారుతుంది. సాధారణంగా 900 పాయింట్లకు గానూ 750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి, కానీ 650 లోపు ఉంటే మాత్రం మిమ్మల్ని ‘హై రిస్క్’ కేటగిరీలో చూస్తాయి. అయితే, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన కొన్ని పద్ధతులు పాటిస్తే మీ స్కోరును సులభంగా పెంచుకోవచ్చు.
క్రెడిట్ స్కోరును పెంచే 6 మార్గాలు..
రీపేమెంట్ హిస్టరీ..
క్రెడిట్ స్కోరులో రీపేమెంట్ హిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక్క ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యమైనా స్కోరు పడిపోతుంది, కాబట్టి ఎల్లప్పుడూ గడువులోపే చెల్లించాలి.
30 శాతం లోపే ఖర్చు..
మీ క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతం లోపే ఖర్చు చేయాలి. ఇది మీరు అప్పుపై అతిగా ఆధారపడటం లేదని బ్యాంకులకు తెలియజేస్తుంది.
‘హార్డ్ ఎంక్వైరీల’ వల్ల..
తక్కువ సమయంలో ఎక్కువ బ్యాంకుల్లో లోన్ల కోసం ప్రయత్నిస్తే ‘హార్డ్ ఎంక్వైరీల’ వల్ల స్కోరు తగ్గుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న పాత అప్పులను ముందుగా తీర్చివేయడం వల్ల మీ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది.
హిస్టరీ ఎంత పాతదైతే స్కోరు అంత బలంగా ..
మీ క్రెడిట్ హిస్టరీ ఎంత పాతదైతే స్కోరు అంత బలంగా ఉంటుంది. అందుకే పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకుండా యాక్టివ్గా ఉంచడం మంచిది.
స్కోరు తగ్గే అవకాశం..
బ్యాంకుల పొరపాట్ల వల్ల కూడా స్కోరు తగ్గే అవకాశం ఉంది. తరచుగా మీ క్రెడిట్ రిపోర్టును గమనిస్తూ, ఏవైనా తప్పులుంటే వెంటనే ఫిర్యాదు చేయాలి.
ఆర్థిక వ్యవహారాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ క్రెడిట్ స్కోరు శిఖరానికి చేరడమే కాకుండా, తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుంది.








