రాముడి చిత్రాల ప్రదర్శన నిలిపేయండి

అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్లో గల ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‍లో తలపెట్టిన చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని అక్కడి హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపు 20 స్వచ్ఛంద సంస్థలు, పలువురు స్వతంత్రులు ఒక సమా్యగా ఏర్పడి న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియోకు లేఖ రాశారు. ఆగస్టు 5న రామాలయం భూమి పూజ సందర్భంగా టైమ్ స్క్వేర్స్ వీధిలోని ఎల్‍ఈడీ స్క్రీన్‍లలో రాముడు, అయోధ్య ఆలయం త్రీడీ ఫోటోలకు సంబంధించిన ప్రదర్శన చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అయితే దీనిపై హక్కుల కార్యకర్తలు స్పందిస్తూ.. తామంతా భారత్‍లో బీజేపీ చేస్తున్న హిందూత్వ జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామనీ, సమగ్రత, సమతుల్యత విలువలు కలిగిన న్యూయార్క్ వంటి నగరంలో ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం ముస్లింల మీద ద్వేషాన్ని విరజిమ్మడమే అని ఆరోపించారు.