16న వైకాపా అభ్యర్థుల జాబితా
వైకాపా అభ్యర్థుల తొలిజాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ నెల 16న ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు. వాస్తవానికి 13న తొలి జాబితా ప్రకటించవలసి ఉంది. జగన్ ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధివద్ద నివాళులర్పించి జాబితాను వెల్లడించనున్నారు. సుమారు 140 మంది ఎమ్మెల్మేలు, 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి ఉపక్రమిస్తారు. ఉదయం 10:26 గంటలకు ఇడుపులపాయ నుంచే ప్రచాయాత్రకు బయల్దేరతారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో తొలి ప్రచార సభలో పాల్గొంటారు.













