పార్లమెంట్ కమిటీల్లో తెలంగాణకు ప్రాధాన్యత
పలు పార్లమెంటరీ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలకు చోటు దక్కింది. పెట్రోలియం, సహజవాయువుల కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఫైనాన్స్, జల్‌శక్తి కమిటీ సభ్యుడిగా నామా నాగేశ్వరరావు, సమాచార, ప్రసార వ్యవహారాల కమిటీ సభ్యుడిగా సంతోష్‌కుమార్, పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాల కమిటీ సభ్యుడిగా బండా ప్రకాశ్, రక్షణ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ట్రాన్స్పోర్ట్, హైవేస్, షిప్పింగ్ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్య యాదవ్‌ను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నియమించింది.













