ఎన్నారై టిఆర్ఎస్ కేసీఆర్ కూపన్స్ ప్రారంభించిన ఎంపీ
ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ తెరాస యూకే అధ్వర్యంలో లండన్‌లో ప్రవాస విద్యార్థులకు నిత్యావసర సరుకుల అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కెసీఆర్ స్ఫూర్తితో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల యుకె వచ్చి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పడ్తున్న ప్రవాస విద్యార్థులకు సామాజిక దూరాన్ని పాటిస్తూ, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దీని కోసం కేసీఆర్ కూపన్స్ కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. నాటి ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ కేసీఆర్ కూపన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు టీఆర్ఎస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు. ఇతర వివరాలకు యూకెలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ విద్యార్థులు అతీఱ•తీ•ఏస్త్రఎ•ఱశ్రీ.•శీఎ ద్వారా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యుకె కార్యవర్గాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.













