ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవం
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కె.నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్‌కు సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అభ్యర్థిని బరిలో దించలేదు. గడువు ముగిసేనాటికి నవీన్‌రావు నామినేషన్ ఒకటే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహ్మాచార్యులు ప్రకటించారు. నవీన్‌రావుకు గెలుపు పత్రం అందజేశారు. అనంతరం నవీన్‌రావు గన్‌పార్క్‌లోని అమరుల స్మారక స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, గెలిపించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.













