తెలంగాణ గేమ్ ఛేంజర్ ‘కాకతీయ టెక్స్టైల్ పార్క్’
తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రంలో వరంగల్ జిల్లా మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో 1,327 ఎకరాల్లో విస్తరించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (KMTP) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ పథకం కింద బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన ఈ పార్క్‌ను, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ ఆర్థిక గమనాన్ని మార్చే ఒక గేమ్ ఛేంజర్.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘5ఎఫ్’ విజన్ (ఫార్మ్, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) కాన్సెప్ట్‌తో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. అంటే పత్తి సాగు చేసే రైతు నుంచి, విదేశీ వీధుల్లో ఫ్యాషన్ దుస్తుల ప్రదర్శన వరకు ఒకే గొడుగు కింద కార్యకలాపాలు సాగుతాయి. ఇందుకోసం కేంద్రం మొదటి దశలో 200 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గడిచిన రెండేళ్లలో పనులు శరవేగంగా పూర్తయ్యాయి.
మొత్తం 1,695 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చెందిన ఈ పార్క్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 232/132/33 కేవీ పవర్ సబ్ స్టేషన్లు, 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేశారు. రోజుకు 12 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసేందుకు 5 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ‘సీఈటీపీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ ప్లాంట్ ట్రయల్ రన్లో ఉంది.
ఒకప్పుడు పనుల జాప్యంతో నిరాశ చెందిన స్థానిక యువతకు, రైతులకు ఈ పార్క్ ఇప్పుడు ఆశాదీపంలా మారింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 24,400 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే 2 వేల మంది విధుల్లో ఉండగా, రానున్న రోజుల్లో శిక్షణ పొందిన వేలాది మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే గణేశా ఎకో, యంగ్ వన్ వంటి కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయి. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ ‘కైటెక్స్’ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 3842 కోట్ల పెట్టుబడులు రాగా, భవిష్యత్తులో ఇది 6వేల కోట్లకు చేరుతుందని అంచనా.
2017లో శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలను దాటుకుని నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఓరుగల్లు గడ్డపై అంతర్జాతీయ స్థాయి టెక్స్టైల్ హబ్ సాకారమైంది. పార్క్‌లోని 62 శాతం భూములు ఇప్పటికే ఇండస్ట్రీలకు కేటాయించడమే దీనికున్న డిమాండ్‌కు నిదర్శనం. పత్తి పండించే రైతుకు గిట్టుబాటు ధర, స్థానిక యువతకు ఉద్యోగం, విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చే ఎగుమతులు.. ఇలా అన్ని కోణాల్లోనూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణ ప్రగతి చక్రంలో కీలక మైలురాయిగా నిలవబోతోంది.Kakatiya Textile Park: తెలంగాణ గేమ్ ఛేంజర్ ‘కాకతీయ టెక్స్టైల్ పార్క్’
తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రంలో వరంగల్ జిల్లా మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో 1,327 ఎకరాల్లో విస్తరించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (KMTP) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ పథకం కింద బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన ఈ పార్క్‌ను, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ ఆర్థిక గమనాన్ని మార్చే ఒక గేమ్ ఛేంజర్.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘5ఎఫ్’ విజన్ (ఫార్మ్, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) కాన్సెప్ట్‌తో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. అంటే పత్తి సాగు చేసే రైతు నుంచి, విదేశీ వీధుల్లో ఫ్యాషన్ దుస్తుల ప్రదర్శన వరకు ఒకే గొడుగు కింద కార్యకలాపాలు సాగుతాయి. ఇందుకోసం కేంద్రం మొదటి దశలో 200 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గడిచిన రెండేళ్లలో పనులు శరవేగంగా పూర్తయ్యాయి.
మొత్తం 1,695 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చెందిన ఈ పార్క్‌లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించారు. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 232/132/33 కేవీ పవర్ సబ్ స్టేషన్లు, 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేశారు. రోజుకు 12 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసేందుకు 5 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ‘సీఈటీపీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ ప్లాంట్ ట్రయల్ రన్లో ఉంది.
ఒకప్పుడు పనుల జాప్యంతో నిరాశ చెందిన స్థానిక యువతకు, రైతులకు ఈ పార్క్ ఇప్పుడు ఆశాదీపంలా మారింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 24,400 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే 2 వేల మంది విధుల్లో ఉండగా, రానున్న రోజుల్లో శిక్షణ పొందిన వేలాది మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే గణేశా ఎకో, యంగ్ వన్ వంటి కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయి. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ ‘కైటెక్స్’ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 3842 కోట్ల పెట్టుబడులు రాగా, భవిష్యత్తులో ఇది 6వేల కోట్లకు చేరుతుందని అంచనా.
2017లో శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలను దాటుకుని నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఓరుగల్లు గడ్డపై అంతర్జాతీయ స్థాయి టెక్స్టైల్ హబ్ సాకారమైంది. పార్క్‌లోని 62 శాతం భూములు ఇప్పటికే ఇండస్ట్రీలకు కేటాయించడమే దీనికున్న డిమాండ్‌కు నిదర్శనం. పత్తి పండించే రైతుకు గిట్టుబాటు ధర, స్థానిక యువతకు ఉద్యోగం, విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చే ఎగుమతులు.. ఇలా అన్ని కోణాల్లోనూ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణ ప్రగతి చక్రంలో కీలక మైలురాయిగా నిలవబోతోంది.