టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ల్ మేయర్ ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిదిలోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. చైర్పర్సన్ ఎన్నికలు జరిగిన 118 మున్సిపాలిటీల్లో 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. రెండు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ ఎన్నిక వాయిదాపడింది. 120 మున్నిపాలిటీలు, 9 కార్పొరేన్ల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు
ఉదయం ప్రమాణం స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. దాదాపు అన్ని చోట్ల గూలాబీ నేతలు ఆ స్థానాల్లో ఆసీనులయ్యారు. పలు మున్సిపాలిటీల్లో స్వతంత్రులు, ప్రతిపక్షపార్టీల నుంచి గెలిచిన పలువురు టీఆర్ఎస్కు అండగా నిలిచారు. సంక్షేమానికి మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు.













