టీఆర్ఎస్ విజయోత్సవాలు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయంపై తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దఎత్తున సంబురాలు నిర్వహించింది. మంగళవారం తెలంగాణ భవన్కు పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. కేటీఆర్ తెలంగాణ భవన్కు రాగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రులు, ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు ఆయనను అభినందించారు. మంత్రులను కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. నేతలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫలితాల వెల్లడి అనంతరం విజేతలకు అభినందిస్తూ ఊరేగింపు నిర్వహించారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.













