తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలల ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను (సెప్టెంబర్ 1 నుంచి) తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెసిడెన్షియల్, సాంఘి సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబంధనల మేరకు తెరిచేందుకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతులకు అనుమతి ఇచ్చింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాలలు బలవంతం పెట్టొదని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్లైన్, ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది. పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధాలను రూపొందించాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చింది. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎస్ఓపీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.













