చెన్నమనేనికి హైకోర్టులో ఊరట..
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమానేని రమేష్‌కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. కేంద్ర హోంశాఖ రద్దు చేసిన చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై న్యాయస్థానం 8 వారాల పాటు స్టే విధించింది. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ, భారతీయ పౌరసత్వం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని పిటీషనర్‌కు సూచిస్తూ.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.













