తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తాము టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావాలని తీర్మానించారు. ఆ లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసర్రెడ్డికి అందజేశారు. మంత్రుల క్వార్టర్స్‌లో స్పీకర్‌ను కలిసి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తీర్మానం లేఖ అందిన వెంటనే టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేస్తూ స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తయినట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. విలీన ఎమ్మెల్యేలంతా కలిసి ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ కార్వనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌తో సమావేశమాయ్యరున. వారందరికీ కేటీఆర్ విందు ఏర్పాటు చేశారు.













