సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ?
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తరగతులు నిర్వహణపై ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, పాఠశాలల ప్రారంభంపై విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతున్నది. పాఠశాలలు తెరుచుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ సూచించడంతో సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు పాటిస్తున్న విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తొలుత 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించి, విడతల వారీగా మిగలిన తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు.













