స్విట్జర్లాండ్ లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం : మహేష్ బిగాల
తెలంగాణ రాష్ట్ర సిఎం శ్రీ కెసిఆర్ ప్రభుత్వం ఆదేశాల మేరకు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతాబ్ది ఉత్సవాలు భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అందించిన అసాధారణమైన సేవలకు తగిన నివాళిగా గొప్ప స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమములో “భారత మాజీ ప్రధాని పి వి నరసింహారావు జన్మ శతాబ్ది ఉత్సవాలు” స్విట్జర్లాండ్‌లో వేదిక: క్లబ్‌హౌస్, ఇమ్ బ్రున్లీ 8152 ఒప్ఫికాన్ లో నిర్వహిస్తున్నారు, సాయంత్రం 4:15 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు గారు, ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, పీవీ కుటుంబ సభ్యులు ప్రభాకర్ రావు గారు ఆన్లైన్ లో జూమ్ ద్వారా, స్విస్ ఎన్నారై సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల మాట్లాడుతూ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.













