నిమ్స్‌లో హైస్పీడ్ 5G వైఫై సేవలు ప్రారంభం
NIMS: రోగుల సౌకర్యార్థం నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అత్యాధునిక 5G వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ ఐఐటీతో కలిసి నిమ్స్ ఈ వినూత్న సేవలను ప్రవేశపెట్టింది. ఆసుపత్రికి వచ్చే రోగులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
జిటల్ పద్ధతిలో వైద్య సేవలు..
5G వైఫై సేవల కోసం ఐఐటీ స్టార్టప్‌ను అభివృద్ధి చేస్తోంది. వీటిని ఇప్పటికే శివారులోని ఒక గ్రామం లోనూ, నిమ్స్‌లోనూ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో రికార్డులతో పనిలేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలను వేగవంతం చేసేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుంది.
ప్రయోజనాలు..
- ఆన్లైన్లోనే డాక్టర్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు.
- వైద్య పరీక్షల రిపోర్టులు, వైద్యులు రాసే రోగి నివేదికలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.
- రోగులకు సూచించిన మందుల వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేసుకునే వీలుంది.
- ఆసుపత్రిలో కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా రాక ఇబ్బంది పడే వారికి, నెట్ బ్యాలెన్స్ లేని వారికి ఈ ఉచిత వైఫై ఎంతో మేలు చేస్తుంది.
వైద్య సిబ్బందికి కూడా..
వైఫై వాడటం వల్ల నెట్వర్క్ సమస్యలు ఉండవని, కేవలం రోగులే కాకుండా వైద్యులు, ఇతర నర్సింగ్ సిబ్బంది కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చని డాక్టర్ బీరప్ప తెలిపారు. దీనివల్ల రిపోర్టులను ఎప్పటికప్పుడు పరిశీలించడం వైద్యులకు సులభతరం అవుతుంది.
ఇవి కూడా చదవండి








