ఆ వ్యవస్థకు అధికారులు లేవు… బాధ్యతలు లేవు
గవర్నర్ వ్యవస్థకు అధికారాలు లేవు, బాధ్యతలు లేవని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని అన్నారు. ఇవాళ దేశాన్ని పాలిస్తున్న వారు హిందీ తప్పనిసరిగా మాట్లాడాలని ఆనడం సరికాదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్న పదాన్ని కూడా నిషేధించాలి. యూనియన్ ప్రభుత్వం అని పిలవాలని సూచించారు. రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాల మీద చట్టాలు చేసి రాష్ట్రాల మీద రుద్దుతుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ను కాదని స్పష్టం చేశారు. బహిరంగంగా గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాలకు 41 శాతం నిధులు ఇస్తున్నామని చెబుతుంది, ఇది పచ్చి అబద్దం అని స్పష్టం చేశారు. కేవలం 21 శాతం నిధులు ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీని వల్ల దక్షిణ రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి. ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి. తద్వారా కేంద్రంలోని మళ్లీ ఉత్తరాది వారే అధికారంలోకి వస్తారని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పై దాడి జరుగుతుంది ఇది మంచిది కాదని అన్నారు.













